Manidweepa Varnana

 Manidweepa Varnana with Lyrics




     https://youtu.be/tq-LTWMJVzA


మణిద్వీప వర్ణననకు అర్ధం:

మణిద్వీపం బ్రహ్మ లోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వ లోకమంటారు. మణిద్వీపం, కైలాసం,వైకుంఠం, గోలోకం, కంటే శ్రేష్టం గా విరాజిల్లుతుంది.

మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది . ఆ సముద్రంలో శీతలమైన తరంగాలు, రత్నాల తో కూడిన ప్రదేశాలు ఉంటాయి, అనేక వర్ణాలు కలిగిన శంఖాలు, జలచరాలు, కన్నులకు విందు చేస్తుంటాయి.

ఆ ప్రదేశానికి బయట 7 యోజనాలు వైశాల్యం గల లోహం తో కూడిన ప్రకారం (గోడ) ఉంటుంది . అనేక రకాలైన అస్త్ర, శస్త్రాలు, ధరించి ఉన్నభటులు ఉంటారు, వారు మణిద్వీపాన్ని నిరంతరం కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారం వద్ద వందలాది మంది భటులు ఉంటారు .

మణిద్వీపం లో అమ్మవారిని నిత్యం ఆరాధించే భక్తులు అనేక మంది ఉంటారు. ప్రతీ అడుగు అడుగుకి స్వచ్ఛమైన మధురమైన నీరు ఉండే సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి, అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహా ప్రాకారం  ఉంటుంది.

సమస్త వృక్ష జాతులు ఇక్కడ ఉంటాయి . అనేక వందల సంఖ్యలో దిగుడు బావులు, నదీ తీరాలు, కన్నులకు పండుగ చేస్తుంటాయి, అనేక జాతుల పక్షులు వృక్షాలపై ఆనందం గా ఎగురుతూ ఉంటాయి.

ఈ  ప్రాకారం దాటిన తరువాత తామ్ర  ప్రాకారం ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు రంగుతో ఉంటాయి.       రక రకాలైన పండ్ల చెట్లు రత్నాలవలె ఉంటాయి, సువాసనలు వెదజల్లుతుంటాయి .

తామ్ర  ప్రాకారం దాటి వెళ్లగా సీస  ప్రాకారం ఉంటుంది, సీస  ప్రాకారం మధ్య భాగం లో సంతాన వాటిక ఉంది, అక్కడ అనేక రకాలైన ఫల- వృక్షాలు ఉంటయి .అక్కడ లెక్క లేనన్ని అమర సిద్ద గణాలు ఉంటాయి.

సీస   ప్రాకారం దాటి వెళ్లగా ఇత్తడి ప్రాకారాల మధ్య బాగం లో హరి చందాన తరువనాలు ఉంటాయి. అక్కడి ప్రదేశమంతా నవ పల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో , పచ్చని పైరులతో కనుల విందుగా ఉంటుంది. అక్కడి నదులు చాల వేగంగా ప్రవహిస్తుంటాయి. 

ఆ ఇత్తడి  ప్రాకారం దాటగా పంచ లోహమయ  ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచ లోహాల ప్రాకారాల మధ్యలో మందార వనములు, చక్కని పుష్పాలతో నయానందకరం గా ఉంటుంది . అక్కడ పారిజాత పుష్పాలు  సుగంధాలు వెదజల్లుతుంటాయి. 

ఆ  ప్రాకారం దాటి వెళ్లగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతూ కనిపిస్తుంది. రజిత, సువర్ణమయ. ప్రాకారాల మధ్య కదంబ వనం ఉంటుంది . ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మద్యం సేవనం వల్ల ఆత్మానందం కలుగు తుంది .

సువర్ణ మాయ ప్రాకారాన్ని దాటి వెళ్లగా ఎర్రటి కుంకుమ వర్ణం కలిగిన పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్య రాగాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు, అన్ని రత్నమయమై ఉంటాయి. 

ఇక్కడ ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ఉంటారు. దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనములతో భాసిల్లుతూ ఉంటుంది. 

అక్కడ మహేంద్రుడు వజ్ర హస్తుడై దేవ సేన తో కలిసి ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగం లో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగం లో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతి దిశలో కృష్ణగన నగరం లో రాక్షసులు ఉంటారు . 

పశ్చిమ దిశలో  వరుణ దేవులు శ్రద్ధావతి  పట్టణం లో పాశం ధరించి ఉంటాడు. వాయవ్య దిశలో గంధవతి లో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. 

ఉత్తర దిశలో కుబేరుడు తన యక్ష సేనలతో, అల్కాపురి లో విశేషమైన సంపదలతో తేజరిల్లుతూ ఉంటాడు.  ఈశాన్యం లో మహారుద్రుడు అనేక మంది రుద్రులతోను ,మాత ల తోను. వీరభద్రాదులతోను, యశోవతి తోను భాసిల్లుతూ ఉంటాడు .

 పుష్యరాగమణుల  ప్రాకారం దాటి వెళ్లగా అరుణ వర్ణం తో పద్మరాగమణి  ప్రాకారం ఉంటుంది . దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాకంగా ఉండి  మండపాలు ఉన్నాయి . వాటి మధ్యలో మహావీరులు, చాతుర్వసృష్టి కళలు కలిగి ఉంటారు. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి . అనేక వందల సైనాలు ఉన్నాయి, రధ , అశ్వాలు ,శస్త్రాలు లేక్కకు మించి ఉన్నాయి .

ఆ ప్రాకారాన్ని దాటి వెళ్లగా గో మేధిక మణి  ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణి కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి.

 అక్కడ 32 శ్రీ దేవి శక్తులు ఉంటాయి . 32 లోకాలు ఉన్నాయి . ఆ లోకం లో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి . వారందరు శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సర్వ సన్నద్ధులై ఉంటారు

గోమేధికా  ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీ త్రిభువనేశ్వరి దేవి దాసదాసీ జనం తో నివసిస్తూ ఉంటారు .

వజ్రాల  ప్రాకారం దాటి వెళ్లగా వైడూర్యాలు ప్రాకారం ఉంటుంది. అక్కడ 8 దిక్కులలో బ్రాహ్మి,  మహేశ్వరీ,కౌమారి, వైష్ణవి,వారాహి, ఇంద్రాణి, చాముండి, అనువారలు సప్త మాతృకలుగా ప్రసిద్ధి చెందారు . శ్రీ మహాలక్ష్మి దేవి అష్టమ మాతృక గా పిలవబడుతున్నారు.

ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్లగా ఇంద్ర నీలమణి  ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి . ఇవి ప్రపంచం లోని వార్తలనన్నిటిని తెలియచేస్తుంటాయి.

ఇంకా ముందుకు వెళ్లగా , మరకతమణి  ప్రాకారం ఉంటుంది . అక్కడ తూర్పు కోణం లో గాయత్రీ, బ్రహ్మదేవుడు, ఉంటారు.

నైరుతి కోణం లో మహారుద్రుడు, శ్రీ గౌరీ విరాజిల్లుతును ఉంటారు. వాయువ్యాగ్ని కోణం లో ధనమతి కుబేరుడు ప్రకాశిస్తుంటారు. పశ్చిమ కోణం లో మన్మధుడు రతీ దేవి తో విలసిల్లుతుంటారు. 

ఈశాన్య కోణం లో విఘ్నేశ్వరుడు ఉంటారు వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు . ఇంకా ముందు వెళ్లగా పగడాల  ప్రాకారం ఉంటుంది . అక్కడ పంచ భూతాల స్వామినిలు ఉంటారు.  

పగడాల ప్రాకారాన్ని  దాటి వెళ్లగా  నవరత్న  ప్రాకారం ఉంటుంది . అక్కడ శ్రీ దేవి యొక్క మహా అవతారాలు, పాశాంకురేశ్వరి , భువనేశ్వరి, భైరవి , కాపల భైరవి. క్రోధ భువనేశ్వరి,  త్రిపుర,అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళీ,తార, షోడశి,భైరవి, మాతంగి  మొదలైన దశ మహా విద్యలు ప్రకాశిస్తుంటాయి . 

నవరత్న  ప్రాకారం దాటి ముందుకు వెళ్తే , మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి వేయి స్తంభాలు, శృంగార, ముక్తి ,జ్ఞాన ,ఏకాంత అనే నాలుగు (4) మండపాలు ఉంటాయి . అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.

ఆ మండపాలికి 4 దిక్కులా  కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పువ్వుల తోటలు, కుంద, పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటాయి . అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపజేస్తాయి. 

అక్కడ గల  మహా పద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు  శ్రవణానందకర స్వరాలతో దివ్య గీతాలను ఆలపిస్తుంటాయి. సభా సదులైన అమరులు మధ్య  శ్రీ లలితా దేవి  సింహాసన ఆసీనురాలై ఉంటుంది.  

శ్రీ దేవి ముక్తి మండపం లో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపం లో నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.  ఏకాంత మండపం లో తన మంత్రిణులతో కొలువై ఉంటుంది. విశ్వ రక్షణ గురించి చర్చిస్తుంటుంది. 

చింతామణి గృహం లో శక్తి తత్వాత్మికాలైన పది సోపానాలతో  దివ్య ప్రభలను వెదజల్లుతూ ఒక మంచము ఉంటుంది . బ్రహ్మ , విష్ణు, రుద్ర, ఈశ్వరులు, దానికి నాలుగు(4 )కోళ్ళుగా ఉంటారు. ఆ నాలుగు కోళ్లపై ఫలకం గా సదాశివుడు ఉంటాడు . దానిపై కోటి సూర్య ప్రభలతో, కోటి చంద్ర శీతలత్వం తో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు ఆశీనులై ఉంటారు.

శ్రీ లలిత దేవి ఙ్ఞా న మనే అగ్ని గుండం నుండి పుట్టినది . నాలుగు బాహువులు కలిగి, అనురాగమను  పాశము, క్రోధమనే అంకుశము, మనస్సు విల్లుగా, స్పర్శ , శబ్ద,రూప, రస, గంధాలను (పంచతన్మాత్రాలను) భాణాలుగా కలిగి ఉంటుంది . బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతి తో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ, మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. 

కురువిందమణులచే ప్రకాశించబడుతున్న కిరీటముచే అలకరించబడినది.  అమ్మవారి నుదురు అష్టమి నటి చంద్రుని వలె ప్రకాశించుతుంటుంది. చంద్రుని లోని మచ్చ వలె ఆమె ముఖము పై కస్తూరి తిలకం దిద్దుకొని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణముల వలె ఉన్నవి.

ప్రవాహమునకు  కదులుచున్న చేపల వంటి  కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన  ముక్కు నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుడక, కడిమి పూల గుత్తి చే అలంకరించ బడిన మనోహరమైన చెవులకు సూర్య చంద్రులు కర్ణాభరణములు గా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపు తో చేయబడిన అద్దము కంటే అందమైన ఎర్రని చెక్కిళ్ళతో  ప్రకాశించు చున్నది. రక్త  పగడమును, దొండ పండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీ మంత్రము నందలి పదునారు భీజాక్షరముల జత వంటి తెల్లని పలువరసలు కలిగి ఉన్నది 

శ్రీ మాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కుల వెదజలుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీ దేవి వీణా నాదమును మించి ఉంటుంది. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరుని చే కట్టబడిన మంగళ సూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూటుంది.

ఆమె భుజములు బంగారు భుజ కీర్తుల తోను  దండ కడియములు, వంకీలతోను అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణములు, ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము  ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. 

ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఆమె ఉంటుంది. సంపూర్ణమైన అరుణ వర్ణం తో ప్రకాశిస్తూ శివ కామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది .


Origin and Realization of Manidweepa

Maha Devi, Herself explains that Maha Purusha and Herself was just the same as a lamp and reflection in a mirror and that She was neither a female nor a male, but a Unique Genderless Nirguna. Any changes witnessed are due to the interplay of ‘Antah Karanas’ or natural instincts like  Mind, Buddhi,  (Mental Power), and ‘Ahankara’ (Ego) on the one hand and ‘Maya’(Illusion) on the other. At the time of Creation following the Great Dissolution (Pralaya), the dissimilarities occurred as Gender, ‘Karma’ (Fate), and ‘Anthah Karanas’ all created by ‘Maya’. It was at that time of Creation, that The Supreme Energy assumed various ‘Vibhutis’ or  Manifestations like Sri (Prosperity), Buddhi(Brainpower), Daya (Compassion), Dhriti (Tolerance), Smriti (Memory), Shraddha (Conviction), Medha  (Acumen), Lajja (Shyness), Shanti ( Peace), Nidra ( Sleep), Pipasa (Desire), Vidya (Comprehension), Spriha (Awaken -ness or Alertness) and Shakti (Power). Maha Devi continued to state that She was the Para, Madhyama, and Pasyanti (Mystic expressions of the Supreme Power indicating the Stages of Manifestations of the Eternal Force); She was Para Shakti beyond one’s  Comprehension, Madhyama Shakti who was both Expressed and Unexpressed (Vyakta –Avyakta) and Pashyanti Shakti who was Fully Manifested and recognizable with Physical Form or Saakara Shakti; She was also present in thirty-five million ‘Nadis’ throughout a human body (the tubular organs of the body like arteries, vie ns, intestines, blood vessels, pulses, etc. She was in Vasa (fat), majja (marrow), Tvak (skin), and Drishti (eyesight) clearly present in each and every part of ‘Samsara’. So was the case of non-moving objects of Creation either animate or inanimate. Maha Devi further affirmed that She was seen as Brahmi or Sarasvati, Vaishnavi or Lakshmi, Eswari as Gauri, Indrani as Indra, Varuni as Varuna, and so on whose formations were all Hers, making the counterpart Purushas perform their tasks as the Maha Devi’s agents or instruments of action. She was the Gunas of Satva, Rajas and Tamas; Ahamkaras-Jnana Sakti (the Power of Knowledge), Kriya Sakti (The Power of Action) and Artha Sakti (The Power of Wealth or Maya the Illusion); The various Tatvas and Maha Tatva; and the interplay of Five Tanmatras or Subtle Elements viz. ( Touch, See, Breathe, Hear and Taste) and Five Basic Elements (Earth, Air, Water, Fire, and Sky) known as the Process of  ‘Panchee- Karana’ resulting in  Five Causes. This was made into a Jeeva (Living Entity) and the Cosmic Totality of That would be Brahma, stated Devi Bhagavati! The features of the Three  ‘Gunas’ or attributes were explained to Narada. Normally, Faith is known to exist in the form of three Gunas viz. Sattva Guna, Rajas Guna, and Tamas Guna. Sattva is described as the fountain of Goodness and happiness in a pure form. Its color is stated to be white standing for purity, integrity, happiness, contentment, forgiveness, and faith. The Rajas Guna is stated to be red in color and is featured as false pride, deceit, avarice, hatred, and selfishness. The Tamo Guna standing for the black color is stated to feature ignorance, lack of resources, anger, fear, and quarrelsomeness. There is no set identity of the Gunas but are intermingled and rapidly changeable. A person who is Good basically might spurt out into anger and pride and change over in the same breath to fear. But surely the resultant impact would be disastrous; An unfulfilled desire would lead to anger. Anger leads to obsession. Obsession leads to failure of memory  (focussed thinking) and lack of memory leads to mental balance!


Manidweepa the Abode of Devi Bhagavati

Being far superior to Kailasa, Vaikuntha, and Goloka, the Sarvaloka or Manidweepa is the residence of Devi Bhagavati in whom the entire Creation rests! Indeed She resides everywhere and anywhere but notionally at Manidweepa and the description is transcripted in detail by Maharshi Veda Vyasa apparently for the consumption of mortals to carry conviction into their consciousness. Surrounded by ‘Sudha Sagara’ (The Ocean of Nectar), Manidweepa has a strong iron enclosure of several Yojanas far and wide with four gates well guarded by Devas and Devis.


Within the First Enclosure, there is an Enclosure of white metal made of an amalgam of zinc and tin/copper which touches Heavens and is a hundred times higher than the walls of the outer Enclosure. 

The Second Enclosure is interspersed with gardens and forests with a wide range of trees and plants, flowers with intoxicating fragrances, luscious fruits along with streams of fruit juices, and gregarious animals and birds of staggering variety.


The third Enclosure is made of copper with a height of seven yojanas comprising several ‘Kalpavrikshas’, with golden leaves/ flowers and fruits yielding gems, fulfilling desires of any imagination. The King of the Gardens along with the wives Madhu Sri and Madhava Sri maintains an excellent Spring Season, where Gandharvas reside, rendering divinely songs and music.


The Fourth Enclosure made of lead with its wall height is again seven yojanas and within the Enclosure are the Sanatanaka trees with flowers whose fragrance reaches as far as ten yojanas and fresh fruits providing sweet juices of great quality and its King with the two queens Sukra Sri and Sudha Sri always maintains enjoyable mild summer where Siddhas and Devas reside here.


The Fifth Enclosure made of brass with a spread of ten yojanas is maintained by its Chief as a perennial Rainy Season accompanied by twelve of his wives,viz. Nabha Sri, Nabhyasya Sri, Sravasya, Rasyasalini, Amba, Dula, Niranti, Varidhara, Abhramanti, Megha Yantika, Varshayanti, and Chivunika. The Trees grown in the Gardens of this Enclosure are Hari Chandana.


The Sixth Enclosure is made of walls with five-fold irons and its Gardens grow Mandara Trees and creepers; the wives of its Chief are Isalakshmi and Urjalakshmi maintaining the Season of Autumn. Here again, Siddhas reside with their wives.


The Seventh Enclosure of seven Yojanas of length is made of Silver, its Chief maintaining Hemanta(dewy) Season with his two wives Saha Sri and Sahasya Sri with Parijata as its main tree and flowers.


The Eighth Enclosure is made of molten gold with Kadamba garden in the center with Tapas Sri and Tapasya Sri as the wives of the King and the fruits of the trees yield honey that is consumed aplenty by Siddhas and wives who are the inhabitants and the season again is dewy.


The Navavarana’ or the Ninth Enclosure is made of Pushparaga gems of Kumkum (saffron) color which is abundant all over inside the Enclosure like forests, trees, rivers, flowers, lotuses, ‘Mandapas’ (Halls), pillars, and so on. All the ‘Dikpalakas’ of High Regency reside in the Eight Directions of the Enclosure, with  the thousand eye bodied Indra in the East in Amaravati on Airavata with Sachi Devi, ‘Vajra Ayudha’ or  thunderbolt, the Celestial Apsarasas and the rest;  Agni Deva in South East with his two wives Svaha and Svadha , his Vahana and other belongings; Yama Dharmaraja in the South  with his ‘Yama danda’ (his Symbol the Celestial Rod) along with Chitragupta;  Nirruti in the South West  with his axe and wife representing Rakshasas’; Varuna Deva in the West with his wife Varuni and ‘Pasa’ (the noose), drinking Varuni honey and with the King of Fishes as his Vahana (Vehicle) and surrounded by aquatic animals; Vayu Deva in the North West with his wife, forty nine members of his Vayu family along with groups of Yogis adept in Pranayama and other practices along with his Deer Vahana; the King of Yakshas and Unparallelled Possessor of Gems and Jewels Kubera in the North along with his two Shaktis Viriddhi and Riddhi and his Generals Manibhadra, Purnabhadra, Maniman, Manikandhara, Manisvargi, Manibhushana and Manikar Muktadhari; Rudra Deva in the North East with other Rudras who are angry and red eyed, armed and mighty, frightful and  revolting,  fiery mouthed and detestably distorted, some times ten handed or thousand handed, odd number footed and odd number mouthed; in the company of Bhadrakalis and Matriganas, Rudranis and Pramadhaganas making ‘Attahasas’ or reverberating screeches and so on.


Tenth Enclosure made of Padmaraga Mani inside which are the Sixty four ‘Kalas’ like Pingalakshi, Visalakshi, Vriddhi, Samriddhi, Svaha, Svadha and so on each of these having hundreds of akshouhini strong armies and individually each of these ‘Kalas’ have the unimaginable Power of destroying a lakh of ‘Brahmandas’(Universes)!


The Eleventh Enclosure is made of Gomeda Mani and within this are the sin-destroying and beneficent Maha Shaktis viz. Vidya, Hri, Pushti, Prajna, Sinivali, Kuhu, Rudra, Virya, Prabha, Nanda, Poshani, Riddhida, Subha, Kalaratri, Maharatri, Bhadra Kali, Kapardini, Vikriti, Dandi, Mundini, Sendhu Kanda, Sikhandini, Nisumbha Sumbha Madini, Mahishasura Mardini, Rudrani, Sankarardha Saririni, Nari, Narayani, Trisulini, Palini, Ambika and Hladini.


The Twelfth Enclosure made of Diamonds and is the dwelling place of Bhuvaneswari, and is surrounded by Eight Shakties viz. Anangarupa, Ananaga Madana, Madanantara, Bhuvana Vega, Bhuvana Palika, Sarvasisira,  Ananga Vedana, and Ananda Madana; each of these Main Attendants of Bhuvaneswari has a lakh of Attendants.


The Thirteenth Enclosure is made of Vaiduryas and the Residences of Eight Matrikas viz. Brahmi, Mahesvari, Kaumari, Vaishnavi, Varahi, Indrani, Chamunda, and Mahalakshmi.


The Fourteenth Enclosure made of Indranilamani, which is the Most Auspicious Place of the Sixteen Petalled Holy Lotus with Sixteen Maha Shaktis resident viz. Karali, Vikarali, Uma, Sarasvati, Sri, Durga, Ushas, Lakshmi, Sruti, Smriti, Dhriti, Sraddha, Medha, Mati, Kanti, and Arya.


The Fifteenth Enclosure made of ‘Mukta’ or Pearls inside which reside Eight Shaktis Ananga Kusuma, Ananga Kusuma Tura, Ananga Madana, Ananga Madanatura, Bhuvanapala, Ganganavega, Sasirekha, and Gangana Vegarekha.


The Sixteenth Enclosure which is made of Marakatha (Vaidurya) is hexagonal of  Yantra Shape, and on the eastern corner of the Center is the Brahma with Devi Gayatri with Vedas, Sastras, and Puranas as well as their Expansions; on the Western corner is Maha Vishnu and Savitri along with their own Expansions; on the North-Western corner is Maha Rudra and Sarasvati with Rudra and Parvati Expansions and Sixty four  Agamas and all Tantras; on the South Eastern side is the abodes of Kubera and Maha Lakshmi; on the Western corner side are the Couple of Madana and Rati Devi and on the North-Eastern side are Ganesha and Pushti Devi.


The Seventeenth one is made of Prabala (Red like Saffron) Devi Bhagavati’s five Elements viz. Hrillekha, Gagana, Raktha, Karailika, and Mahochuchusma;


Finally, the Eighteenth Enclosure is built with Navaratnas (Nine Jewels) with Bhagavati in the Center with ‘Pancha Amnayas’ (Eastern Amnaya is Creation by Mantra Yoga, Southern is Maintenance by Bhakti, Western is Pralay by Karma Yoga, Northern is Grace by Jnana Yoga and Urdhva Amnaya is Liberation); ten Maha Vidyas (Kali, Tara, Chhinnamasta, Bhuvaneswari, Bagala, Dhumavati, Matangi, Shodasi and Bhairavi) and Avataras viz. Bhuvanesvaris Pasamkusavari, Bhairavi, Kapala, Amakusa, Paramada, Sri Krodha, Triptavasarudha, Nityaklinna, Annapurnesvari, and Tvarita.


Ratnagriha or the Crown Palace of Mula Prakriti or Maha Devi Bhagavati is beyond the Eighteenth Enclosure, built of Chintamani Gems with thousands of pillars built by Suryamani Gems or Vidyutkantamani Gems. Four huge ‘Mandapas’ or halls each with thousand pillars in the Palace are made of a kaleidoscopic and artistic mix of ‘Navaratnas’ (The Nine Gems) viz. Mukta, Manikya, Vaidurya, Gomeda, Vajra, Vidruma, Padmaraga, Nila, and Marakatas with dazzling lights and exhilarating perfumes suited to the Themes of the Halls designated as Shringara, Mukti, Jnana, and Ekanta.


In the Central place of each of the Halls, there is a Very Special  Chintamani Griha or the Sanctum Sanctorum on a raised platform with a plank supported by the four legs of Brahma, Vishnu, Rudra, and Mahesvara and the plank is Sadasiva Himself!


The Maha Tattvas are the staircases leading to the Upper Chambers. Mula Prakriti and Maha Purusha constitute two halves of the Physical Formation of  Maha Devi cum Maha Deva with Five Faces of Each Half, with corresponding three Eyes and four arms and armory, one hand reserved exclusively for providing boons. The Attending Sakhies are those surrounding the ‘Ardhanarisara’ are Icchaa Sakti, Jnaana Sakti, and Kriya Sakti who are always present with the Maha Bhagavati along with Lajja, Tushti, Pushti, Kirti, Kanti, Kshama, Daya, Buddhi, Medha, Smriti, and Lakshmi in their physical Forms. The Nine Pitha Shaktis Jaya, Vijaya, Ajita, Aparajita, Nitya, Vilasini, Dogdhri, Aghora, and Mangala are at the constant Service. Devi Bhagavati is simultaneously present in all the Mandapas; enjoying Vedas, Hymns of Praise, and Music in  Shringara Hall; freeing Jivas from bondages in Mukti Hall; rendering advice and instructions in Jnana Hall and conducting consultations in Ekanta Mandapa with Ministers like Ananga Kusuma etc.on matters of vital significance related to Creation, Preservation, and Destruction of Evil. Indeed the inhabitants of Manidweepa are all those who have attained Samipya, Salokya, Sarupya, and Sarvasti. They have no Arishdvargas to overcome, no tattvas to gain, no gunas to regulate, no Yogas to perform, no ambitions or desires to fulfill. They have no concepts of time, death, age, distance, body, mind, light, season, or the ‘Tapatriyas’. Human beings normally tend to describe the negativity of life always but the Eternal State of Perfect Equilibrium is something utterly unimaginable!


Maharshi Veda Vyas assured that reading, listening, or imagining about Manidweepa and of the Glories of Devi Bhagavati would provide peace of mind, contentment, and fresh springs of hope, purpose, and direction of life especially when new projects or actions are launched as also when apprehensions, obstacles, diseases, tragedies or even death are envisaged! (Source: Devi Bhagavata)





Source: templepurohit.com







Comments

Popular posts from this blog

Sri Dakshinamurthy Stotram

Shyamala Dandakam

Sri Dakshinamurthy Stotram(Ashtakam)