Manidweepa Varnana
Manidweepa Varnana with Lyrics https://youtu.be/tq-LTWMJVzA మణిద్వీప వర్ణననకు అర్ధం: మణిద్వీపం బ్రహ్మ లోకానికి పైన ఉంటుంది. దీనిని సర్వ లోకమంటారు. మణిద్వీపం, కైలాసం,వైకుంఠం, గోలోకం, కంటే శ్రేష్టం గా విరాజిల్లుతుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది . ఆ సముద్రంలో శీతలమైన తరంగాలు, రత్నాల తో కూడిన ప్రదేశాలు ఉంటాయి, అనేక వర్ణాలు కలిగిన శంఖాలు, జలచరాలు, కన్నులకు విందు చేస్తుంటాయి. ఆ ప్రదేశానికి బయట 7 యోజనాలు వైశాల్యం గల లోహం తో కూడిన ప్రకారం (గోడ) ఉంటుంది . అనేక రకాలైన అస్త్ర, శస్త్రాలు, ధరించి ఉన్నభటులు ఉంటారు, వారు మణిద్వీపాన్ని నిరంతరం కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారం వద్ద వందలాది మంది భటులు ఉంటారు . మణిద్వీపం లో అమ్మవారిని నిత్యం ఆరాధించే భక్తులు అనేక మంది ఉంటారు. ప్రతీ అడుగు అడుగుకి స్వచ్ఛమైన మధురమైన నీరు ఉండే సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి, అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహా ప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు ఇక్కడ ఉంటాయి . అనేక వందల సంఖ్యలో దిగుడు బావులు, నదీ తీరాలు, కన్నులకు పండుగ చేస్తుంటాయి, అనేక జాతుల పక్షులు వృక్షాలపై...